జీవితంపై విరక్తితో యువకుడి బలవన్మరణం
జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిన్న శివునూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
దిశ చేగుంట: జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిన్న శివునూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై పోచయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న శివునూరు గ్రామానికి చెందిన సుంచుబాబు (28) ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పండ్ల అర్చనతో వివాహమైంది. ఈ క్రమంలో అను ఇల్లరికం కూడా వెళ్లాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో తిరిగి స్వగ్రామమైన చిన్న శివునూరులోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య దూరం కావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచయ్య తెలిపారు.