పాల ధరలపై రైతులకు అవగాహన కల్పించాలి

పెరిగిన పాల సేకరణ ధరలపై పాడి రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య అభివృద్ధి, డెయిరీ డెవెలప్ మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా అధికారులకు సూచించారు.

Update: 2023-05-07 13:46 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పెరిగిన పాల సేకరణ ధరలపై పాడి రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య అభివృద్ధి, డెయిరీ డెవెలప్ మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విజయ డైరీ నిర్వహణను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి, అధర్ సిన్హా పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ సింగ్ పాల సేకరణ, శీతలీకరణ ఇతర వివరాలను తెలియజేశారు. ఏడు శాతం వెన్న కలగిన పాలకు పాడి రైతులకు ఏప్రిల్ 1 నుంచి లీటర్ కు రూ.55 నుంచి రూ.60 పెంచినట్లు తెలిపారు.

దీంతో రోజువారీ పాల సేకరణ 32 వేల లీ. నుంచి 42 వేల లీ. వృద్ధి చెందిందన్నారు. ఈ సందర్భంగా అధర్ సిన్హా మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందించడమే ధ్యేయంగా రోజు వారీ పాల సేకరణ 60 వేల లీటర్లకు పెరిగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ సిద్దిపేట మేనేజర్ శ్రీజ, జూనియర్ మేనేజర్ మురళి, అసిస్టెంట్ మేనేజర్ రామస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కోమటి చెరువును రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య అభివృద్ధి, డెయిరీ డెవెలప్ మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా సందర్శించారు.

Tags:    

Similar News