ప్రతి ఒక్క పేదవాడికి మంచి వైద్యం అందించాలి : నారాయణఖేడ్ ఎమ్మెల్యే

వైద్యులు రోగులకు మంచి వైద్యం అందించినప్పుడే పేరు

Update: 2025-01-06 10:19 GMT

దిశ,నారాయణఖేడ్ : వైద్యులు రోగులకు మంచి వైద్యం అందించినప్పుడే పేరు స్థిరస్థాయిగా ఉండిపోతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. సోమవారం సిర్గాపూర్ మండల కేంద్ర పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నూతన 108 అంబులెన్స్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రి ఆవరణలో మొత్తం చుట్టూ తిరిగి రోగుల రూమ్ లోకి వెళ్లి వారి ఆరోగ్యం క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మా కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం పట్ల ఎంతో శ్రద్ధతో ప్రతి ఒక్క పేదవాడికి మంచి వైద్యం అందించాలని ఒక గొప్ప సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకెళుతుందని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రి వైద్యులకు సిబ్బందులకు గ్రామాల నుంచి అమాయకమైన ప్రజలు ఆసుపత్రికి వస్తా ఉంటారు, కావున వారిని మీరు ప్రేమతో పలకరించి వారికి సరైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి ,మహేశ్వర్ సెట్,సల్మాన్, జ్ఞానేశ్వర్, విఠల్ రావు, మాజీ ఎంపీటీసీ పీరప్ప, శభాష్, సాయిలు, లక్ష్మయ్య, అనంత్ రెడ్డి,సుభాష్,జైరాజ్ ఆసుపత్రి వైద్యులు వైద్య సిబ్బంది, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News