వృత్తి నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు : సిద్దిపేట కలెక్టర్
వృత్తి నైపుణ్య శిక్షణ తో ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : వృత్తి నైపుణ్య శిక్షణ తో ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎల్ అండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...నైపుణ్య శిక్షణకు విద్యార్థులు పెద్ద సంఖ్యంలో వచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
అదే విధంగా సిద్దిపేట అర్బన్ మండలం మెట్టపల్లి గ్రామంలో నిర్మిస్తున్న జిల్లా సమాఖ్య భవనం, ప్రభుత్వ వృద్ధాశ్రమం, ఎన్సాన్ పల్లి గ్రామంలోని నిర్మాణంలో ఉన్న జైలు ప్రాంగణాలను కలెక్టర్ మను చౌదరి పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, జైలు సూపరింటెండెంట్ దశరథం, అర్బన్ తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.