Bandi Sanjay : రైళ్లను నిలిపేందుకు కృషి చేస్తా

అన్ని వర్గాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

Update: 2024-08-10 14:59 GMT

దిశ,వెల్దుర్తి : అన్ని వర్గాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.శనివారం మాసాయిపేట గ్రామానికి చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీనివాస నగర్ రైల్వే స్టేషన్ లో కాచిగూడ నార్కెడు

ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను నిలిపాలని, అలాగే మేడ్చల్ సికింద్రాబాద్ లోకల్ ట్రైన్ ను వడ్డారం రైల్వే స్టేషన్ వరకు పొడిగించాలని వినతిపత్రం సమర్పించారు. స్పందించిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ… రైళ్ల నిలుపుదల విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి హామీపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హరి రంజన్ శర్మ, సురేష్, ధర్మపురి శరత్ చంద్ర, వెంకటేశం, రంగారెడ్డి భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.


Similar News