మహిషాసురమర్ధినిగా ఏడుపాయల వనదుర్గమ్మ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి

Update: 2024-10-10 11:52 GMT

దిశ, పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదవ రోజైన గురువారం అష్టమి పురస్కరించుకొని వనదుర్గామాతను మహిషాసురమర్ధిని (మహాగౌరి) రూపంలో, ఎరుపు రంగు వస్త్రంలో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు పార్టీవ శర్మ, శంకర శర్మ తదితరులు వేకువ జామునే మూలవిరాట్, రాజగోపురం, గోకుల్ షెడ్ లో ప్రతిష్టించిన వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, అర్చనలు నిర్వహించి ఎరుపు రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News