ఏడుపాయల దేవస్థానం ఏ+ గ్రేడ్ గా అప్ గ్రేడ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల దేవస్థానం ఇక మీద ఏ ప్లస్ గ్రేడ్ గా అప్ గ్రేడ్ కాబోతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదివారం తెలిపారు.
దిశ, మెదక్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల దేవస్థానం ఇక మీద ఏ ప్లస్ గ్రేడ్ గా అప్ గ్రేడ్ కాబోతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదివారం తెలిపారు. ఇటీవల ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రతిపాదనలు అందించామని. ఈ విషయం పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించి ఏడుపాయల దేవస్థానం ను అతి త్వరలోనే ఏ ప్లస్ గ్రేడ్ గా అప్ గ్రేడ్ గా తీర్చిదిద్దబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ఏ+ గ్రేడ్ గా అప్ గ్రేడ్ అవుతే దేవాలయం కు అడిషనల్ కమిషనర్ పోస్ట్ ఏర్పడడంతో అడిషనల్ కమిషనర్ నియామకం అవుతారని ఆయన తెలిపారు. ఉన్నత స్థాయి అధికారి రాకతో ఏడుపాయల దేవస్థానం అభివృద్ధి మరింత వేగవంతంగా చేసుకోవచ్చునని అన్నారు. అడిషనల్ కమిషనర్ తో అభివృద్ధికి సుస్థిర మార్గంగా ఏర్పాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు.