మళ్లీ పెరుగుతున్న చలి.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత..
సంగారెడ్డి జిల్లా మళ్లీ చలి తీవ్రత భారీగా పెరుగుతుంది.
దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా మళ్లీ చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. గత కొంతకాలంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వారం రోజుల పాటు చలి తీవ్రత తగ్గింది. అల్పపీడనం తగ్గడంతో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. శనివారం రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయి మొదటి స్థానంలో ఉంది. చలికి గ్రామాలు, పట్టణాలు ప్రజలు ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం 5 గంటల నుంచి చలి వణికిస్తుంది. రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ లో 6.0, న్యాల్ కల్ 6.3 అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా చౌటాకుర్ 17.3 గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది.
ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు తోడు చల్లగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. చలి తీవ్రత పెరగడం పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా నామోదైన ఉష్ణోగ్రతల వివరాలు అత్యల్పంగా అందోల్ 7.3, జహీరాబాద్ 7.5, గుమ్మడిదల 7.7, రామచంద్రపురం పుల్ కల్ 8.2, మొగుడంపల్లి 8.3, నిజాంపేట్ 8.5, ఝరా సంగం 8.7, మునిపల్లి 9.0, అన్న సాగర్.. సిర్గాపూర్ 9.3, కంగ్టి 9.6, పుల్ కల్ 9.7, కల్హేర్ 10 తదితర ప్రాంతాల్లో కనిష్ట అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో సైతం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.