పబ్బుల ప్రభాకర్ రెడ్డి కావాలా.. దుబ్బాక అభివృద్ధి కావాలా..
దుబ్బాక నియోజకవర్గం అనుక్షణం తపించే కాంగ్రెస్ పార్టీ కావాలా పబ్బులు అడిగే ప్రభాకర్ రెడ్డి కావాలా దుబ్బాక ప్రజలు తెలుసుకోవాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, చేగుంట : దుబ్బాక నియోజకవర్గం అనుక్షణం తపించే కాంగ్రెస్ పార్టీ కావాలా పబ్బులు అడిగే ప్రభాకర్ రెడ్డి కావాలా దుబ్బాక ప్రజలు తెలుసుకోవాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి, వల్లూరు, భీమ్రావుపల్లి తదితర గ్రామాలలో ఆదివారం ప్రచారాన్ని నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం ఆత్మగౌరవాన్ని సిద్దిపేట నాయకులకు తాకట్టు పెట్టే నాయకులు కావాలా తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో కనబడుతున్నాయని 9 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలన ఏమి చేయలేదని పేర్కొన్నారు.
డిసెంబర్ 9 నాడు ఏర్పడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతుందని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రజలను మోసం చేస్తారని పేర్కొన్నారు. ముత్యం రెడ్డి కొడుకుగా ప్రజలకు మాటిస్తూ గుడిసె లేని గ్రామాలను చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే ఆరు గ్యారంటీల పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రచార రథముపై గ్రామంలో పర్యటించి ప్రజలకు అభివాదం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి వెంట నార్సింగి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, చేగుంట మండల పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి పిప్పీరి వినోద్ కుమార్, డీసీసీ నాయకులు యాదగిరి యాదవ్, గొల్ల కరకయ్య, శంకర్ నాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.