వడ్ల రాజయ్యకు డాక్టరేట్

నారాయణఖేడ్ పట్టణానికి చెందిన నారాయణ ఖేడ్ సాహితీ మిత్ర మండలి అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కల్హేర్ ప్రథమ శ్రేణి తెలుగు పండితులుగా విధులు నిర్వహిస్తున్న వడ్ల రాజయ్యకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాచ్య భాషల విభాగం తెలుగు శాఖ డాక్టరేట్ ప్రదానం చేసింది.

Update: 2023-05-16 15:59 GMT

'ఆశావాది ప్రకాశరావు కవిత్వం ఒక పరిశీలన' అనే అంశంపై పరిశోధన

దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణానికి చెందిన నారాయణ ఖేడ్ సాహితీ మిత్ర మండలి అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కల్హేర్ ప్రథమ శ్రేణి తెలుగు పండితులుగా విధులు నిర్వహిస్తున్న వడ్ల రాజయ్యకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాచ్య భాషల విభాగం తెలుగు శాఖ డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగు అకాడమి పూర్వ ఉపసంచాలకులు డా.అప్పం పాండయ్య గారి పర్యవేక్షణలో పద్మశ్రీ 'ఆశావాది ప్రకాశరావు కవిత్వం ఒక పరిశీలన' అనే అంశం మీద పరిశోధన నిర్వహించి సిద్ధాంత గ్రంథం సమర్పించినందుకు గాను రాజయ్యకు ఉస్మానియా యూనివర్సిటీ పీ.హెచ్.డీ ప్రదానం చేసింది.

వీరికి ఉస్మానియా తెలుగు శాఖ హెచ్.వో.డీ ప్రొఫెసర్ చింతకింది కాశీం, ప్రాచ్య భాషల విభాగ అధిపతి డా.సిల్మా నాయక్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా రసగీతి సాహిత్య సంస్థ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, సాహితీ మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి సీహెచ్. భూమయ్య, సభ్యులు నాగభూషణం, మడుపతి జగదీశ్వర్, మారుతీ, పద్మాకర్, పండరి, చంద్రశేఖర్, వెంకట్రావ్, చంద్రకాంత్, నీరజ, గౌరమ్మ, మాణిక్యం, మహేందర్, దేవేందర్ రెడ్డి, తదితరులు రాజయ్యకు అభినందనలు తెలియజేశారు.

Tags:    

Similar News