ఉత్సవాలకు వందల కోట్లు వృధా.. కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వం దగా చేస్తుందని, కోట్లాది రూపాయలు నిధులు వృదా చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు.
దిశ, మెదక్ ప్రతినిధి : దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వం దగా చేస్తుందని, కోట్లాది రూపాయలు నిధులు వృదా చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ గురువారం మెదక్ లో ఆందోళన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక డీసీసీ ఆఫీస్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని నిర్వహించి ఆందోళన నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో కలిసి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల పేరిట రాష్ర్ట ప్రభుత్వం వందలాది కోట్లు ప్రజాధనాన్ని వృధాచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని ఆయన ప్రభుత్వం పై మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాల్లో వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మాట ఏమైందనీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేజీ టు పీజీ, ఉచిత విద్య ఊసేలేదని ఆయన ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటుందనీ, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి దనీ మండిపడ్డారు.
పన్నుల రూపంలో ప్రజలు కడుతున్న సొమ్ముతో ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవలసింది పోయి, ఇలా ప్రజా ధనాన్ని వృధా చేస్తూ మరో వైపు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని మండిపడ్డారు. ఫీజ్ రీయంబర్స్ మెంట్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, శాతం ముస్లిం రిజర్వేషన్లు, శాతం గిరిజన రిజర్వేషన్లు అన్ని ఉత్తమాటలు చెప్పి ప్రజలను నట్టేట మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు సుప్రభాత రావు, మామిల్ల ఆంజనేయులు,పల్లె రాంఛాందర్ గౌడ్ శంసుందర్, శ్రీమాన్ రెడ్డి, గూడూరి కృష్ణ, హఫీజ్ ఉద్దీన్, రమేష్ రెడ్డి, శ్రీకాంతప్ప, గూడూరి ఆంజనేయులు,మంగ మోహన్, శంకర్, గోవింద్ నాయక్, చింతల యాదగిరి, లింగం గౌడ్, అహేమద్, గోపాల్ రెడ్డి, ఇస్మాయిల్, సత్యం గౌడ్, నర్సింహ గౌడ్, శివకుమార్, ప్రసాద్ గౌడ్, ఉదయ్ కుమార్, అనిల్, అక్బర్, చందు గౌడ్, సిద్ధ గౌడ్, శ్రీహరి, ఇతరులు పాల్గొన్నారు.