ధరణి స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలించిన కలెక్టర్
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ధరణి దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు.
దిశ, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ధరణి దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రైతులతో మాట్లాడారు. ధరణి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం సోలక్ పల్లి గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు.