ధరణి , ప్రజావాణి దరఖాస్తులు ఆన్‌లైన్ ఎంట్రీ పూర్తి చేయాలి : కలెక్టర్ క్రాంతి వల్లూరు

ధరణి, ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి,

Update: 2024-07-02 15:10 GMT

దిశ,సంగారెడ్డి మున్సిపాలిటీ: ధరణి, ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ లో ఉన్న ధరకాస్తులను త్వరితగతిన ఆన్లైన్ ఎంట్రీ పూర్తి చేయాలని , ధరణి సమస్యలను వారంలోపు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. మంగళవారం జిల్లాలో ఉన్న ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో ధరణి ,ప్రజావాణి అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ , రికార్డుల పరిశీలన , సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తూ డిస్ పోస్ చేయాలని అన్నారు. దరఖాస్తుల సత్వర పరిశీలన కోసం అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఆర్ఎస్ఆర్ లిమిట్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సక్సెషన్, పి ఓ బి, మ్యుటేషన్, మొదలైన వివిధ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతుల పై అధికారులకు పలు సూచనలు చేశారు.

కోర్టు కేసులు, పిఓబి కేసులు అన్నింటిని పరిష్కరించాలన్నారు. ధరణి సమస్యల పరిష్కారంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంప్రదించాలని, వీలైనంత తొందరగా పెండింగ్ లేకుండా చూసుకోవాలని, తప్పులు చేయకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మ్యుటేషన్, సక్సెషన్, నాలా కన్వర్షన్, ఖాతా మెర్జింగ్, పాస్ పుస్తకాలలో డేటా కరెక్షన్, టీఎం-33 తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలన్నారు.

టీఎం-33 లో తిరస్కరించినవి ఉంటే వెంటనే కలెక్టరేట్ కు పంపించాలని తెలిపారు. సక్సెషన్ రికార్డులు కలెక్టరేట్ కు పంపినప్పుడు లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ జతచేసి పంపాలన్నారు . వారి కుటుంబ సభ్యులు వివరాలు తహసీల్దారులే నిర్ధారించాలని తెలిపారు . ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతి గురించి రోజు వారీగా నిశిత పరిశీలన జరపాలని ఆర్డీఓ లను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలనీ ఆదేశించారు. ప్రజావాణి పెండింగ్ వివిధ శాఖలకు చెందినవి, రెవెన్యూ శాఖకు చెందినవి వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. ఈ టెలికాన్ఫిరెన్స్ లో సమీక్ష రెవిన్యూ అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓ లు , తహసీల్దార్లు పాల్గొన్నారు.

Similar News