'దళిత బంధు' అమలుపై అసెంబ్లీలో చర్చించండి.. ఎమ్మెల్యేకు డీబీఎఫ్ వినతి పత్రం
'దళిత బంధు' పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను 'దళిత బహుజన ఫ్రంట్' జాతీయ కార్యదర్శి పి. శంకర్ విజ్ఞప్తి చేశారు.
దిశ, దుబ్బాక: 'దళిత బంధు' పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను 'దళిత బహుజన ఫ్రంట్' జాతీయ కార్యదర్శి పి. శంకర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాయపొల్ మండలంలో పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ను డీబీఎఫ్ నేతలు కలిశారు. ఎమ్మెల్యే తో బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై చర్చించారు.
'దళిత బంధు' పథకానికి 2022-23 బడ్జెట్‌లో రూ. 17,700 వేల కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. రెండో విడత ప్రతి నియోజకవర్గంలో 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రభుత్వ హామీ కాగితాలకే పరిమితమైందని వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తామని ఎమ్మెల్యే రఘునందన్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు పాల్గొన్నారు.