డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి.. కలెక్టర్ క్రాంతి వల్లూరు

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు.

Update: 2024-09-26 16:20 GMT

దిశ, సంగారెడ్డి : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న రెండు పడక గదులు ఇండ్లు సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వానికి అందించాలని గృహ నిర్మాణ శాఖ, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. నారాయణఖేడ్ డివిజన్ లోని జూకల్ శివారు గ్రామంలో పూర్తికావస్తున్న రెండు పడక గదుల ఇండ్లను, జహీరాబాద్ డివిజన్ హోతి కె గ్రామంలోని రెండు పడక గదుల ఇండ్లు వేగవంతం చేయాలన్నారు.

రెండు పడక గదుల పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి కావలసిన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసి హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ కి పంపించాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ మేనేజర్ శ్రీనివాస రావును ఆదేశించారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లన్నీ వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అంగన్వాడి బిల్డింగ్స్ లలో టాయిలెట్స్, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ జగదీష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి జ్యోతి, మెప్మా పీడీ గీత, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ అధికారులు, సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


Similar News