అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ వాళ్లు మొనగాళ్లు : కేసీఆర్

కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని వారు మాటలు నమ్మితే మోసపోతామని కేసీఆర్ అన్నారు.

Update: 2023-11-16 15:48 GMT

దిశ, నర్సాపూర్: కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని వారు మాటలు నమ్మితే మోసపోతామని కేసీఆర్ అన్నారు. గురువారం నర్సాపూర్ వెల్దుర్తిలో బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభను బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికలు మీ తలరాతలు మారుస్తాయని ఎన్నికల సమయంలో ఆగమాగం కావద్దని అభ్యర్థుల గుణ గణాలు, పార్టీల చరిత్ర కూడా చూడాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో మనలో తీవ్రంగా ఘోష పెట్టిందని, ఎరువుల, విత్తనాల, కరెంటు కోసం ప్రతి విషయంలో మనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆ పార్టీ జాతీయ నాయకుడు ధరణిని బంగాళాఖాతంలో పడేస్తాడని అన్నారు. ధరణి పోతే మళ్ళీ తిరిగి పాత రోజులే వస్తాయని వీఆర్వోలు, అధికారులు లంచాలకు పట్టి పీడిస్తారని అన్నారు. ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ వాళ్లు మొనగాళ్లు అని వాళ్ల మాటలు విని మోసపోవద్దని అన్నారు. రేవంత్ రెడ్డికి ఓటుతో గుణపాఠం చెప్పాలని సూచించారు. అనంతరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ... తెలంగాణ మేమే ఇచ్చినం అని చిదంబరం అంటున్నారని ప్రజలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ముందే తెలంగాణ ఇచ్చి ఉంటే వందల మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడుకునే వాళ్ళమని, రేవంత్ రెడ్డి సోనియాను బలి దేవత అని కుర్చీ కోసం మాట మార్చాడని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ధరణి వద్దు అన్నవాళ్ళను బంగాళాఖాతంలో కలపాలని సూచించారు.



దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 24 గంటలపాటు కరెంటు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. తనకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన గాలి అనిల్ కుమార్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి గాలి అనిల్ కుమార్, మెదక్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మ్యాడం బాలకృష్ణ, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయపల్లి గోపి, బీజేపీ రాష్ట్ర నాయకుడు గడిల శ్రీకాంత్ గౌడ్, రాజేశ్వరరావు దేశ్ పాండే, కౌన్సిలర్ సునీత బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింగ్ రావు అజ్మత్ తదితరులు కేసిఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, జగదీష్, పైడి శ్రీధర్ గుప్తా, లకావత్ రమేష్ నాయక్, జెడ్పీటీసీలు మేఘమాల, ఆంజనేయులు, పబ్బ మహేష్ గుప్తా, మన్సూర్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News