ఇప్పుడు గుర్తొచ్చాయా అమరవీరుల కుటుంబాలు.. చెరుకు శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమరవీరుల కుటుంబాలు ఇప్పుడు గుర్తొచ్చాయా అంటూ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.
దిశ, దుబ్బాక : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమరవీరుల కుటుంబాలు ఇప్పుడు గుర్తొచ్చాయా అంటూ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక స్థానిక బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే ఉత్సవాల పేరుతో పేద ప్రజల డబ్బులను వృధా చేస్తూ పేద ప్రజల సంపాదనను దోచుకుంటున్నారన్నారు అని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఒక్కరూపాయి నష్టపరిహారం ఇవ్వలే కానీ దశాబ్ధి ఉత్సవాలు మాత్రం బ్రహ్మండంగా నిర్వహించారు అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సమన్వయం జరుగుతుంది అన్నారు. తొలిదశ ఉద్యమం నుండి తమ ఇల్లు, జాగా, కుటుంబం, చదువు, బతుకు తెరువు జీవితాన్ని వదిలిపెట్టి రాబోయే తరాల కోసం తమ ఆత్మబలిదానం కొంతవరకైనా పనిచేస్తుందని ఆశించిన వాళ్ళందరూ అమరు లై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వారి ఆకాంక్షలు నెరవేరలేదు అన్నారు. అమరుల కుటుంబాలు మాత్రం ఆగమైపోయాయి అన్నారు. నియోజకవర్గంలో ఎంతమంది నిరుద్యోగలకు ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విజయ్ పాల్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, మండల ఇంచార్జ్ కొంగర రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల భరత్, మంద శ్రీనివాస్, పాతూరు వెంకటస్వామి గౌడ్, పోగుల రాజిరెడ్డి, శ్రీరామ్ నరేందర్, కనకరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.