ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ.. కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి

సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.

Update: 2024-10-03 07:25 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ఎ మ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.ఇటీవల దుబ్బాకలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలతో ట్రోలింగ్ చేయడం వెనుక దుబ్బాక బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హస్తముందని ఆరోపిస్తూ, దుబ్బాకలో ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నం చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని వాహనాలపై కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలతో దుబ్బాక పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Similar News