MLA : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి మాసాయిపేట మండలాల్లో ఐకెపి పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు

Update: 2024-10-21 12:51 GMT

దిశ,వెల్దుర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి మాసాయిపేట మండలాల్లో ఐకెపి పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం కు బేషరతుగా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మండలాల్లో 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు అన్ని రకాల ధాన్యానికి బోనస్ ప్రకటిస్తామని తెలిపిన ప్రభుత్వం ఎన్నికల అయిన తర్వాత సన్న ధాన్యం కు మాత్రమే బోనస్ ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తో పాటు మక్కలు, కందులు, పెసర్లకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొలతలు వేసి కోనడం ఎక్కడా లేదని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అనంత రెడ్డి తహసిల్దార్ కృష్ణ, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, సొసైటీ సీఈవో సిద్దయ్య, రైతులు, నాయకులు పాల్గొన్నారు.


Similar News