యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేయండి: కలెక్టర్ శరత్

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపాదికన త్వరగా పూర్తిచేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ శరత్ కాంట్రాక్టర్లకు అధికారులను ఆదేశించారు.

Update: 2023-02-23 16:12 GMT

దిశ, సదాశివపేట: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపాదికన త్వరగా పూర్తిచేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ శరత్ కాంట్రాక్టర్లకు అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఇకనుంచి పనుల్లో వేగం పెంచి నిర్మాణాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రయత్నించాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ మ్యాపును జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఇంజనీర్ రాజేష్, ఉప తహసీల్దార్ విష్ణు, ఆర్ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News