ఐటీ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ భేటీ
సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ హరీష్ రావు ఆలోచన మేరకు సిద్ధిపేట జిల్లా కేంద్రంగా నిర్మించిన ఐటీ టవర్ లో ప్రముఖ ఐటీ కంపెనీలు భాగస్వామ్యం కావడం సంతోషకరమని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.
ఐటీ టవర్ ప్రారంభం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ హరీష్ రావు ఆలోచన మేరకు సిద్ధిపేట జిల్లా కేంద్రంగా నిర్మించిన ఐటీ టవర్ లో ప్రముఖ ఐటీ కంపెనీలు భాగస్వామ్యం కావడం సంతోషకరమని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన కలెక్టర్ ఐటీ టవర్ ప్రారంభ ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఓఎస్ఐ డిజిటల్, జోలాన్ టెక్, విసన్ ఇన్ఫోటెక్, అమిడాయ్ ఎడ్యుటెక్, ఫిక్సిటీ టెక్నాలజీస్, ఇన్నోసోల్, థోరాన్ టెక్నాలజీస్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్, ర్యాంక్ ఐటీ సర్వీసెస్, తదితర కంపెనీలు ఐటీ టవర్ కేంద్రంగా కార్యకలాపాల నిర్వహణకు ముందుకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వపరంగా ఐటీ కంపెనీలకు రాయితీలు కల్పించేందుకు సిద్ధంగా ఆయన వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో ఐటీ కంపెనీ ప్రతినిధులు, ఐటీ టవర్ నిర్వాహకులు చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.