కలెక్టరేట్‌లో ఉద్రిక్తత.. దళిత బంధు కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ

దళిత బంధు కోసం రెండు వర్గాల మధ్య రాజుకున్న చిచ్చు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది..

Update: 2023-09-14 16:08 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: దళిత బంధు కోసం రెండు వర్గాల మధ్య రాజుకున్న చిచ్చు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది.. దళిత బంధు మాకు వర్తింపజేయాలని కోరుతూ కలెక్టర్ కు వినతి కోసం వచ్చిన బారీ పై దళితులు దాడి చేసేందుకు యత్నించడం తో కలెక్టరేట్ లో ఉద్రిక్తత గా మారింది. వెల్దుర్తి మండలం కుక్కునూరు లో దళిత బందు పథకం విషయంలో బుడగ జంగాలు, దళితుల మధ్య గ్రామాల్లో ఘర్షణ జరిగింది.. దళిత బంధు లో మాకు అవకాశం కల్పించాలని కోరుతూ బుడగ జంగాల రాష్ట్ర నాయకులు, బుడగ జంగాలు మెదక్ కలెక్టరేట్ కు వచ్చారు.

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇచ్చేందుకు కలెక్టర్ ఛాంబర్ వద్దకు వెళ్లగా కుక్కునూరు కు చెందిన దళితులు దాదాపు 150 మంది వచ్చారు.. అక్కడ పోలీస్ ను తోసుకుంటూ కలెక్టర్ ఛాంబర్ వద్ద ఉన్న బుడగ జంగాల పై దాడి చేసేందుకు యత్నించారు.. అప్పటికే అక్కడ ఉన్న వారి మరో గదిలో ఉంచి వారికి రక్షణ కల్పించారు.. కలెక్టరేట్ లోకి వచ్చిన దళితులను సైతం అక్కడి నుంచి పంపించారు.. రెండు వర్గాలు ఒక్క సారిగా రావడం తో కలెక్టరేట్ లో ఉద్రిక్తత గా మారింది.. దళిత బంధు తమకే ఇవ్వాలని దళితులు కోరగా, మాకు ఇవ్వాలని బుడగ జంగాలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో దాడి చేసిన వారు కలెక్టరేట్ వరకు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తే గ్రామంలో తమకు రక్షణ ఏమిటని ప్రశ్నించారు.. గ్రామంలో రక్షణ కల్పించిన దళిత బంధు బుడగ జంగాల తో పాటు 57 ఉప కులాలకు కూడా వర్తింపజేయాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.


Similar News