మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కౌన్సిలర్లు డుమ్మా
కౌన్సిలర్లు రాకపోవడంతో చేర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేశారు.
దిశ చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీలో మంగళవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికార పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకపోవడంతో సంఖ్యా బలం లేకపోవడంతో సమావేశాన్ని రద్దు చేశారు. దీంతో కౌన్సిలర్లు సమావేశానికి రాకపోవడంతో పట్టణంలోని హాట్ టాపిక్ గా మారింది. చైర్ పర్సన్, కౌన్సిలర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్ పర్సన్ ను మార్చాలనే ఉద్దేశంతో కొందరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఒకటై అసమ్మతి రాగాలు వినబేడుతున్నారు. కాగా మంగళవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించినప్పటికీ ఏ ఒక్క కౌన్సిలర్ కూడా రాకపోవడంతో పట్టణంలో చర్చనీయంగా మారింది. ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి కౌన్సిలర్లను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికి ఫలితాన్నివ్వలేదు. ఏదీ ఎమైనప్పటికి చేర్యాల మున్సిపాలిటీలో చైర్ పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు గా సాగుతున్న కోల్డ్ వార్ ఏ పరిణామాలకు దారి తీస్తోందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.
Read more: