' Chandrayaan 3 ' సక్సెస్.. వినూత్నంగా విషెస్ తెలిపిన లీఫ్ ఆర్టిస్ట్
చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా భారత్ తన సత్తా చాటింది. రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది.
దిశ, నారాయణ ఖేడ్ : చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా భారత్ తన సత్తా చాటింది. రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. 2019లో చంద్రయాన్-2 విఫలమైనప్పటికీ ఇస్రో పకడ్బందీగా ప్రాజెక్టును తీర్చిదిద్దడంతో ఈసారి సక్సెస్ అయింది. చంద్రయాన్-3 సక్సెస్‌తో ఇస్రో పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. మధ్యాహ్నం 2.35 నిమిషాలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ ఆకాశాన్ని చీల్చుకుంటూ గగనతంలోకి పయనమైంది. ఈ నేపథ్యంలో నారాయణ ఖేడ్ కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ ఇస్రోకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. రావి ఆకు మీద చంద్రయాన్-3, ఇస్రో చైర్మన్ యస్.సోమనాథ్ చిత్రాలను రూపొందించి వారికి శుభాకాంక్షలు తెలిపాడు.