మాయ మాటలతో గొలుసు చోరీ

మెదక్ జిల్లా రామాయంపేట శివారులో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన బలిజే మల్లేశం,లక్ష్మి దంపతులు ద్విచక్ర వాహనం పై రామాయంపేట ఆసుపత్రికి వెళ్తున్నారు

Update: 2024-09-17 09:23 GMT

దిశ, నిజాంపేట: మెదక్ జిల్లా రామాయంపేట శివారులో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన బలిజే మల్లేశం,లక్ష్మి దంపతులు ద్విచక్ర వాహనం పై రామాయంపేట ఆసుపత్రికి వెళ్తున్నారు. ఈ తరుణంలో రాయిలాపూర్ కామన్ దగ్గర ద్విచక్ర వాహనం పై వచ్చిన ఇద్దరు దుండగులు వారిని అడ్డగించి బంగారు నగలు మెడలో వేసుకొని వెళ్లవద్దని, దొంగలు ఉంటారని మాయ మాటలు చెప్పి మెడలోని బంగారు గొలుసును పేపర్ లో పెట్టుకొని వెళ్లాలని నమ్మించి పేపర్ లో రాళ్ళు పెట్టి బంగారు నగలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News