ప్రశాంతంగా పాలిటెక్నిక్ పరీక్ష

పాలిటెక్నీక్ (పాలిసెట్) పరీక్షలు ప్రశాంతగా ముగిశాయి. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఐదు కేంద్రాల్లో పాలిసెట్ పరీక్షలు నిర్వహించారు.

Update: 2023-05-17 14:30 GMT

90 మంది గైర్హాజర్.. నిమిషం నిబంధన అమలు

దిశ, మెదక్ ప్రతినిధి : పాలిటెక్నిక్ (పాలిసెట్) పరీక్షలు ప్రశాంతగా ముగిశాయి. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఐదు కేంద్రాల్లో పాలిసెట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,940 మంది అభ్యర్థులను జిల్లాకు కేటాయించగా 1,850 మంది పరిక్షకు హజరైనట్లు (95.3 శాతం) అధికారులు వెల్లడించారు. మరో 90 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 910 మంది బాలురు 940 బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కేంద్రాలకు సమీపంలోకి ఎవ్వరిని అనుమతించ లేదు. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్ష రాసేందుకు అనుమతించ లేదు. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు మెదక్ జిల్లా కో-ఆర్డినేటర్, మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ సువర్ణ లత తెలిపారు.

Tags:    

Similar News