హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.
దిశ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి చేరికలు జరుగుతున్న తరుణంలో శుక్రవారం అనూహ్యంగా మీర్జాపూర్ సర్పంచ్ లత - మహేందర్ సహా మాజీ ఉపసర్పంచ్ తరాల కనుకయ్య ముఖ్యనాయకుడు బండి వెంకట్ రెడ్డితో సహా 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అక్కన్నపేట మండలం రేగొండ గ్రామ శాఖ అధ్యక్షుడు కాగిత రాజిరెడ్డి సీపీఐ పార్టీ నుండి మూల వెంకట్ రెడ్డి బొడిగ మల్లేష్ తో సహా 20 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా అక్కన్నపేట మండలం మల్చెరువు తండా నుండి ఉపసర్పంచ్ గుగులోతు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బానోతు మున్నా, వార్డు మెంబర్ లతో సహా 20 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.