BRS party : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..
అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
దిశ, అందోల్: అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్, న్యాయవాది అల్లె శ్రీకాంత్ ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అల్లె శ్రీకాంత్ జోగిపేట పట్టణానికి ఉప సర్పంచ్‌గా, మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అదే విధంగా న్యాయవాది కావడం, ముదిరాజ్ సామాజీక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీఆర్‌ఎస్ పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందనే చెప్పవచ్చు. ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.... అల్లె శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం అల్లె శ్రీకాంత్ మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ పార్టీలో తగిన గౌరవం, గుర్తింపు లేకపోవడంతోనే తాను పార్టీని మారానన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడిన వారికి ఆ పార్టీలో గుర్తింపు లేదని, ఇంకా చాలా మంది ఆసంతృప్తులు బీఆర్‌ఎస్‌లో ఉన్నారని, వారంతా త్వరలో పార్టీని వీడుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్‌లు ఎస్.సురేందర్‌గౌడ్, రంగ సురేష్, ఎ.చిట్టిబాబు, నాగరాజ్, దుర్గేష్, చందర్, హరికృష్ణాగౌడ్, నాయకులు ప్రవీణ్, శ్రీనివాస్, శేఖర్‌గౌడ్, రాజశేఖర్, రాజు, మధు, అనిల్, కొత్త శ్రీనివాస్, పాటు తదితరులు ఉన్నారు.