ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు..

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ

Update: 2025-01-06 08:51 GMT

దిశ,రాయికోడ్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 వ తరగతిలో 100 సీట్లు, 7 వ తరగతి నుంచి 10 వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్,ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. జనవరి 6 వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 తేదీ వరకు ఆన్లైన్ లో htt:/ Telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలపడం జరిగింది. ఓసి,విద్యార్థులకు 200/- రూ.. రుసుము బీసీ,ఎస్సీ,ఎస్టీ, పీహెచ్సీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 125/రూ. చెల్లించాల్సి ఉంటుంది.దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 13 వ తేదీన పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ రవీందర్ అన్నారు.6 వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. అదే విధంగా 7 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.కావున మండల విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు.


Similar News