ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని టీపీసీసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి విమర్శించారు.
దిశ, వెల్దుర్తి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని టీపీసీసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం రాష్ట్ర పీసీసీ పిలుపు మేరకు వెల్దుర్తి మండల కేంద్రంలో జోడో యాత్ర వార్షికోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాన్నన రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీలు కలిసి పని చేస్తాయని, ఆ బంధాన్ని కొనసాగించేందుకు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయిన సీఎం కూతురును కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయలేదన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ కృష్ణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు నాగరాజు, దుర్గగౌడ్, వెంకట్ రెడ్డి, అన్వేష, పోతిరెడ్డి మైసయ్య, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వేరుగా భారత్ జూడో యాత్ర వార్షికోత్సవ ర్యాలీ నిర్వహించారు.