ఊరెళ్లి వస్తున్న ఇద్దరి ఉసురు తీసిన లారీ
లారీ, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది.
దిశ, నర్సాపూర్ : లారీ, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. సోంపేట మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (26), అతని స్నేహితుడు నాగరాజు (25) కొంపల్లి వెళ్లి వన్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ ఎన్జీవోస్ కాలనీ వద్దకు రాగానే హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ వీరి బైకును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అల్లీపూర్ గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్, నాగరాజులు అక్కడికక్కడే మృతి చెందారు. దుర్గాప్రసాద్ కు భార్య సారికతో పాటు ఓ కూతురు ఉన్నారు. నాగరాజుకు భార్య మేఘమాలతో పాటు ఓ కూతురు ఉన్నారు. ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అల్లిపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.