వరదల్లో చిక్కుకున్న కార్మికులు.. రెస్క్యూ చేసి రైతు వేదిక వద్దకు తరలించిన ఏసిపి

బుధవారం కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని బస్వాపూర్ వద్ద బ్రిడ్జి పనులు చేస్తున్న 8 మంది కార్మికులు వరద నీటిలో చిక్కుకోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు

Update: 2024-09-04 07:58 GMT

దిశ, హుస్నాబాద్: బుధవారం కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని బస్వాపూర్ వద్ద బ్రిడ్జి పనులు చేస్తున్న 8 మంది కార్మికులు వరద నీటిలో చిక్కుకోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పోలీస్ సిబ్బంది గ్రామస్తుల సహకారంతో ఐదు కుటుంబాలకు చెందిన 8 మందిని రెస్క్యూ చేసి బస్వాపూర్ రైతు వేదిక వద్దకు తరలించినట్లు తెలిపారు. బస్వాపూర్ మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాగుకు ఇరువైపులా బ్లాక్ చేసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, కాబట్టి చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరు కూడా ఆ వాగు ప్రదేశానికి, దరిదాపుల్లోకి కూడా రావొద్దని ఏసీపి ఒక ప్రకటనలో తెలిపారు.


Similar News