ప్రమాదవశాత్తు రేకుల ఇళ్లు దగ్ధం...కాలి బూడిదైన కరెన్సీ

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ రేకుల ఇళ్లు దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

Update: 2024-10-20 16:35 GMT

దిశ, పాపన్న పేట : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ రేకుల ఇళ్లు దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోదండం సాయిలు బుడగ జంగం కాలనీలో రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఓ పని నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు అంటుకున్నాయి. బయటకు పొగ వ్యాపించడంతో స్థానికులు ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేసింది. అప్పటికే  ఇంట్లోని బీరువాలో ఉన్న నగదు, బంగారం, వెండి వస్తువులు, నిత్యావసర సరుకులు, వస్తువులు మంటల్లో కాలిపోయాయి. సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయాడు.


Similar News