317 బాధిత ఉపాధ్యాయులను స్థానిక జిల్లాలకు పంపాలి..

317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులను వెంటనే బేషరతుగా వారి వారి స్థానిక జిల్లాలకు పంపే విధంగా తగుచర్యలు తీసుకోవాలని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-09-23 16:44 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులను వెంటనే బేషరతుగా వారి వారి స్థానిక జిల్లాలకు పంపే విధంగా తగుచర్యలు తీసుకోవాలని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ మండలంలోని మాచవరం, రాజ్ పల్లి, మక్త భూపతిపూర్, ఆవుసులపల్లి పాఠశాలల్లో ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయి ఇక ఎన్నటికీ మా స్థానాలకు మేము వెళ్లే పరిస్థితి లేదని మానసికంగా కుంగిపోయి బోధన పై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు.

ఇటీవల మంత్రివర్గ ఉపసంఘానికి దరఖాస్తు చేసుకున్న అందరూ ఉపాధ్యాయ బాధితులకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న నాలుగు డీవీలను విడుదల చేయాలని, ఆమోదయోగ్యమైన పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని కోరారు. వెంటనే పదివేల పీఎస్ హెచ్ఎం పోస్టులు సృష్టించి ఎస్జీటీ (బీఈడీ) ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా ఆర్థిక కార్యదర్శి కిష్టయ్య జిల్లా నాయకులు అశోక్, వేణుగోపాల్, ఎల్లం అరుణ్ కుమార్, దిలీప్ కుమార్, దుర్గరాములు, మల్లేష్ మండల శాఖ అధ్యక్షులు నర్సిములు తదితరులు పాల్గొన్నారు.


Similar News