మీది సిద్ధిపేటనా...? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే...

సిద్దిపేట మున్సిపాలిటీకి 3 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి. సదుపాయాల కల్పన- విశ్వసనీయ సేవలు... 3 ISO certificates for Siddipet Municipality

Update: 2023-02-16 13:38 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట మున్సిపాలిటీకి 3 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి. సదుపాయాల కల్పన- విశ్వసనీయ సేవలు, సమర్థ హరిత, వర్ధాల నిర్వహణ, ఆరోగ్య- సంరక్షణ అమలు అంశాలల్లో సిద్దిపేట మున్సిపాలిటీకి ఐఎస్ఓ సర్టిఫికేట్లు లభించగా బుధవారం సిద్దిపేట మున్సిపాల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మున్సిపాల్ చైర్ పర్సన్ ముంజుల రాజనర్సుకు అందజేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ప్రజలు, పాలకవర్గం, అధికారులు సిబ్బంది సమిష్టి కష్ట ఫలితం 3 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయన్నారు. మూడు ఐఎస్ఓ సర్టిఫికెట్లు పొందిన ఏకైన మున్సిపాలిటీగా సిద్దిపేట మున్సిపాలిటీ నిలువడం గర్వంగా ఉందన్నారు. ఈ సర్టిఫికెట్లు తడి, పొడి, హానికర చెత్తలను వేరువేరుగా మున్సిపాలిటీకి అందిస్తూ సిద్దిపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా నిలుపుతున్న సిద్దిపేట పట్టణ ప్రజలకు అంకితమన్నారు. సర్టిఫికెట్ల రావడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. చిన్నచిన్న లోటుపాట్లను సరి చేసుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలను అందంచాలని పాలక వర్గానికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, సుడా చైర్మన్ మారెడ్డి. రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, ఐఎస్ఓ సంస్థ ప్రతినిధి శివయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News