Deputy CM Bhatti: వారికి కనీస వేతనం చెల్లించే విధంగా చర్యలు:డిప్యూటీ సీఎం భట్టి

ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.

Update: 2024-08-30 09:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఫిజికల్ సెక్యూరిటీలో పని చేసే వారికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని, వారికి కనీస వేతనం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ ను భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నగర భద్రతలో సెక్యూరిటీ సంస్థలను భాగస్వామ్యం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని, సెక్యూరిటీ రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయని 1500 ఏజెన్సీలు పని చేయడం సంతోషకరమన్నారు. నిధులు అవసరం ఉన్న ప్రతి చోట ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తున్నదని, నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగరానికి ప్రభుత్వం 10 కోట్లు బడ్జెట్ లో కేటాయించిందన్నారు. పోలీస్ శాఖ ప్రైవేట్ సెక్యూరిటీలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రైవేట్ ఏజెన్సీలు అందరూ తప్పనిసరిగా లైసెన్స్ లు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న రాష్ట్ర పోలీసులను అభినందిస్తున్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీని నిర్మింస్తున్నామన్నారు.


Similar News