ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం భారీగా ట్రాన్స్‌ఫర్స్

ఎన్నికల కోడ్ ముగుస్తున్నా నేపథ్యంలో ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ల కు రంగం సిద్ధమవుతోంది.

Update: 2024-06-05 04:45 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : ఎన్నికల కోడ్ ముగుస్తున్న నేపథ్యంలో ఆఫీసర్ల ట్రాన్స్‌ఫర్లకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడగా ఈ నెల 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఒక్కోశాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ మొదలు కానుంది. ఈ క్రమంలో జిల్లాల్లో అన్ని శాఖల పరిధిలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం తప్పనిసరిగా మారింది.

ఇప్పటికే చాలా మంది అధికారులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అయితే తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు కొందరు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతేగాక ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్ళిన వారంతా తిరిగి వచ్చేందుకు పెద్ద ఎత్తున పైరవీలు మొదలు పెట్టినట్లు సమాచారం. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారంతా దాదాపు బదిలీలపైనే వచ్చిన వారే ఉండగా ఈ క్రమంలో సొంత జిల్లాలకు తిరిగి వెళ్ళేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

రెవెన్యూలో టెన్షన్

ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ శాఖలో పూర్తిగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు (ఏఆర్వో), రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వో)గా ఉన్నారు. డీటీ, తహసీల్దార్, ఆర్డీవో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆపై ఆఫీసర్లకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. దాంతో జిల్లాలో చాలా మంది తహసీల్దార్లు, జిల్లా పరిధిలోనే ఉంటూ దూరంగా పని చేస్తున్న అధికారులు తిరిగి తమ స్థానాల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఎక్కువ మంది పైరవీల కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో ఎవరికి ఎక్కడ పోస్టింగ్ దక్కుతుందోనని కొందరు టెన్షన్ పడుతున్నారు. మండలాలతోపాటు ఇతర కలెక్టరేట్లోని ఆయా సెక్షన్ల ఇన్చార్జీలు, ఆర్డీవో, ఆఫీసుల్లో సూపరింటెండెంట్ పోస్టుల్లో ఉన్న వారిని బదిలీ చేస్తారనే గుబులుతో ఉన్నారు.

ఏండ్లుగా ఒకే చోట తిష్ట..

ప్రభుత్వ ఉద్యోగులకు మూడు, అయిదెండ్ల లోపు బదిలీలు చేపట్టాలి. కానీ కొన్ని కీలక శాఖలోని ఉద్యోగులు ఏండ్లుగా తిష్ట వేసి పని చేస్తున్నారు. ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా సీట్లు వదలడం లేదు. మరి కొందరు పై ఆఫీసర్లను మచ్చిక చేసుకుని కోరుకున్న చోట కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఆఫీసర్లను ట్రాన్స్ఫర్లు చేయాలని సొంత శాఖ ఉద్యోగులే కోరుకుంటున్నారు. ఇక రెవెన్యూతోపాటు సాధారణ పరిపాలన, ఎడ్యుకేషన్, హెల్త్, మున్సిపల్, పంచాయతీ, అగ్రికల్చర్, పశు, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లతో పాటు ఇతర అన్ని విభాగాల్లో పని చేస్తున్న అధికారులకు బదిలీలు ఉండనున్నాయి.

ముఖ్యంగా ఏండ్ల తరబడి హెల్త్ డిపార్ట్మెంట్ లలో బదిలీలు లేకపోవడంతో ఎక్కువగా ఈ డిపార్ట్ మెంట్ లోనే ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు అరేండ్లు గా వైధ్యాధికారులు పని చేస్తుండగా, వీరితో పాటు ఎండ్లుగా రెగ్యులర్, కాంట్రాక్ట్, ఉద్యోగులు సైతం తిష్ట వేసి కూర్చున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యుటేషన్లు రద్దు చేసిన జిల్లాలో మాత్రం సక్రమంగా చేయలేదు. లేని ఎమార్జెన్సీ సృష్టించి కొందరు డిప్యుటేషన్ నుండి మినహాయింపు పొందారని సొంత శాఖ నుండే విమర్శలు ఉన్నాయి.తాము కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడం కోసం అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తునట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..


Similar News