పోలింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు.. డీజీపీ రవిగుప్తా

పోలింగ్ కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు.

Update: 2024-05-11 14:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: పోలింగ్ కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 73,414 మంది సివిల్ పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. 500 తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగాలు ఎన్నికల డ్యూటీలో భాగస్వామ్యం అవుతాయన్నారు. ఎలక్షన్స్‌కు 164 కేంద్ర బృందాలతో బందోబస్తు చేస్తామన్నారు. తమిళనాడు నుంచి 3 స్పెషల్ ఆర్మ్ డ్ బృందాలు.. బందోబస్తుకు ఇతర రాష్ట్రాల నుంచి 7వేల మంది హోంగార్డులు.. ఎన్నికల విధుల్లో 2,088 మంది ఇతర శాఖల సిబ్బంది పాల్గొంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రత, తనిఖీ నెట్ వర్క్ ఏర్పాటు చేశామన్నారు. నెట్ వర్క్‌లో 482 ఫిక్స్‌డ్ స్టాటిక్ టీమ్‌లు, 462 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 89 అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో 127 అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయంలో కేంద్రీకృత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.      

Read More..

BREAKING : హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు 

Tags:    

Similar News