Samagra Shiksha : సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ..ఉద్రిక్తత
ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ(Job Permanent) సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగు(Samagra Shiksha Employees)లు వరుస ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ(Job Permanent) సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగు(Samagra Shiksha Employees)లు వరుస ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను సీఎం రేవంత్ రెడ్డి పర్మినెంట్ చేయాలంటూ బషీర్‌బాగ్‌లో సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ(Massive Rally)నిర్వహించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాటతో కొంత ఉద్రిక్తత(Tensions)నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి ర్యాలీ భగ్నం చేశారు.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోగా, వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలన్న ఆలోచన చేస్తుందన్న ప్రచారం ఉద్యోగుల్లో మరింత ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వం పంతాలకు పోకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.