కూల్చకుండా స్టే ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన మర్రి లక్ష్మణ్ రెడ్డి

MLRIT సంస్థల అధినేత మర్రి లక్ష్మణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దుందిగల్‌లోని MLRIT, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేశారు.

Update: 2024-08-28 10:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: MLRIT సంస్థల అధినేత మర్రి లక్ష్మణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దుందిగల్‌లోని MLRIT, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేశారు. చిన్న దామెర చెరువు ఆక్రమించి FTL, బఫర్ జోన్‌ పరిధిలో నిర్మాణాలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏడు రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని.. లేకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు కాలేజీ కూల్చకుండా స్టే ఇవ్వాలని బుధవారం మర్రి లక్ష్మణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా, 489, 485, 458, 484, 492, 489 సర్వే నెంబర్లలో బిల్డింగులు, షెడ్లు, వాహనాల పార్కింగ్‌తో పాటు కాలేజీ రోడ్లు నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలోని 13 చెరువుల కబ్జాల వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే సైతం నిర్వహించారు.


Similar News