తెలంగాణ అసెంబ్లీలో ఆంక్షలు.. ఇకపై వారికి నో ఎంట్రీ
తెలంగాణ అసెంబ్లీలో పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఇన్నర్ లాబీలోకి మాజీ ప్రజా ప్రతినిధులకు అనుమతిని నిరాకరించారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఇన్నర్ లాబీ(Assembly Inner Lobby)లోకి మాజీ ప్రజా ప్రతినిధులకు అనుమతిని నిరాకరించారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు ఇన్నర్ లాబీ లోకి అనుమతి లేదంటూ (no entry) బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే మీడియాపై కూడా పలు ఆంక్షలు(Restrictions on media) విధించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎటువంటి వీడియోలు తీయొద్దు అని ఆదేశాలు జారీ చేశారు. కాగా అసెంబ్లీలో ఆంక్షలు పెట్టడంపై మాజీ ప్రజాప్రతినిధులు(Former public representatives) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ చరిత్రలో తొలిసారి మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీల్లోకి నో ఎంట్రీ బోర్టులు పెట్టారని మండిపడుతున్నారు.