అందెశ్రీ పాటలో రెడ్డి పేరు లేదని మిగతా కులాల పేర్లు కూడా తీయించాడు.. రేవంత్‌ రెడ్డిపై మందకృష్ణ సెటైర్

తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

Update: 2024-06-03 10:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కవి అందెశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. నిన్న జూన్ 2న తారీఖున ఆమోదించిన కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదని వెల్లడించారు. సమక్క సారక్క, కుమ్రంభీమ్‌ పేర్లను తొలగించారని, మంత్రి సీతక్క మనసు ఎలా ఒప్పుకుందని మండిపడ్డారు. కంచర్ల గోపన్నతో సహా కవుల పేర్లు గీతంలో ఎందుకు లేవని నిలదీశారు. అందెశ్రీ రాసిన పాటలో రెడ్డి సామాజిక వర్గం పేరు లేదని, ఇక వేరే కులాల పేర్లు ఎందుకు అని రేవంత్ రెడ్డి తీయించేసి ఉంటాడని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విని అందెశ్రీ తన గౌరవాన్ని కోల్పోయారని అన్నారు. అందెశ్రీ రాసిన పాత గీతం ప్రజల హృదయాల్లో నిలిచిందని.. కొత్త గీతాన్ని చూస్తే పూర్తిగా వ్యతిరేకంగా కన్పిస్తున్నదని, ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్‌‌ను కలుస్తామని స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారు? అని ప్రశ్నించారు. సమ్మక్క సారక్కలను కాకతీయులు చంపితే.. గిరిజనులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. చార్మినార్ మన వారసత్వ సంపద అని గుర్తుచేశారు

Tags:    

Similar News