12 మంది ఎమ్మెల్యేలను TRS లో చేర్చుకొన్న కేసీఆర్ను దేంతో కొట్టాలి..? మల్లు రవి
గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటే నమ్మలేదని.. కానీ, నిన్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాటలతో నిజమని అర్ధమైందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటే నమ్మలేదని.. కానీ, నిన్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాటలతో నిజమని అర్ధమైందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. సీఎం కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారని.. భవిష్యత్లో అధికారంలోకి రావడం కల అన్నట్లు మాట్లాడారని అన్నారు. కేసీఆర్ కుమార్తె కవితను బీజేపీలోకి రావాలని అడుగుతున్నారని అనడం అందుకు నిదర్శనమన్నారు. బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేలకు తమపై నిఘా ఉందని కేసీఆర్ భయపెడుతున్నారని మల్లు రవి ఆరోపించారు. ఎమ్మెల్యేలను భయపెట్టడానికే నిన్న సమావేశం పెట్టారా? అని ప్రశ్నించారు. పార్టీ మారాలని బీజేపీ నేతలు అడిగితే చెప్పుతో కొట్టాలని కేసీఆర్ చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కానీ తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకొన్న కేసీఆర్ను దేంతో కొట్టాలో చెప్పాలన్నారు. ప్రగతిభవన్లోనే భద్రత అంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more:
1.అక్కడ టీఆర్ఎస్లో విచిత్ర పరిస్థితి.. ఇద్దరు మాజీలు టికెట్ కోసం పోటీ