త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయండి.. రోనాల్డ్ రాస్
హైదరాబాద్లోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ పరిశీలించారు.
దిశ, సిటీ బ్యూరో: త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా లోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ పోలీస్ కమిషనర్లతో పాటు కలిసి గురువారం ఉదయం పరిశీలించారు. ఎల్బీ స్టేడియం, నిజాం కాలేజ్, ఏవీ కాలేజ్, కోఠి ఉమెన్స్ కాలేజ్, జేఎన్టీయూ, ఎగ్జిబిషన్ గ్రౌండ్, పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్, రెసెప్షన్ సెంటర్లలో ఏర్పాట్లను పరిశీలన చేసిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మౌలిక వసతులపై ఆరా తీశారు. వీలైనంత తొందరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.