బదిలీలు షురూ చేసిన సర్కార్.. సీనియర్ IAS మహేష్ దత్ ఎక్కా ట్రాన్స్‌ఫర్..!

ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఇన్ని రోజులు బ్రేకులు పడగా.. లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో మళ్లీ

Update: 2024-05-17 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఇన్ని రోజులు బ్రేకులు పడగా.. లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో మళ్లీ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్లు షూరు అయ్యాయి. తాజాగా గనులు, భూగర్భ వనరుల శాఖ కార్యదర్శి ఎండీ మహేష్ దత్ ఎక్కా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రభుత్వం సురేంద్ర మోహన్‌ను నియమించింది. దీంతో పాటు టీఎస్ఎండీసీ వీసీ, ఎండీగా సురేంద్ర మోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.


Similar News