అలంపూర్ పై వివక్ష ఎందుకు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా గజ్వేల్ పరిధిలో ప్రతి ఊరుకి డబల్ బెడ్ రూంలు రోడ్డుకి ఇరువైపులా కట్టిన ముఖ్యమంత్రికి, గృహ నిర్మాణ శాఖ మంత్రికి అలంపూర్ గుర్తుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని, అలంపూర్ పై బీఆర్ఎస్ పాలకులకు ఎందుకు వివక్ష అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

Update: 2023-03-03 15:18 GMT

దిశ, ఉండవల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా గజ్వేల్ పరిధిలో ప్రతి ఊరుకి డబల్ బెడ్ రూంలు రోడ్డుకి ఇరువైపులా కట్టిన ముఖ్యమంత్రికి, గృహ నిర్మాణ శాఖ మంత్రికి అలంపూర్ గుర్తుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని, అలంపూర్ పై బీఆర్ఎస్ పాలకులకు ఎందుకు వివక్ష అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బహుజన రాజ్యాధికార సాధనలో భాగంగా శుక్రవారం జోగులంబా గద్వాల జిల్లా ఉండవల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అలంపూర్ చౌరస్తా బీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

జిల్లెలపాడు, సుల్తానపురం, ర్యాలంపాడు గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కూడా లేవని, ఎంత సేపు తుంగభద్రపై బ్రిడ్జి వేశామని పాలకులు మురిసి పోతున్నారే తప్ప, దాని తర్వాత ఆ గ్రామాల ప్రజలు ఎలా బతుకుతున్నారు, వారి జీవిన విధానం ఎలా ఉంది, తినడానికి తిండి దొరుకుతుందా, ఉండడానికి ఇల్లు ఉందా అనే ధ్యాస ఏ మాత్రం లేదన్నారు. అసలు ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఉన్నారా ? లేరా ? అనే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. సమస్యలు చెప్పుకుంటూ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లెలపాడు గ్రామానికి కాలి నడకన పోయామని, మరి ఆ ఊరు తెలంగాణలో ఉందా? ఆంధ్రలో ఉందా? అఫిక్రాలో ఉందా అన్న విషయం స్థానిక ఎమ్మెల్యే అబ్రహం చెప్పాలన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడే బస్సులు అందుబాటులో ఉండేవని రాష్ట్రం ఏర్పడ్డాక బస్సులు లేక విద్యార్థులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే 40 సంవత్సరాలుగా ఇమాంపురం, బస్సాపురం, భైరాపురం, బూడిదపాడు తదితర ప్రాంతాల్లో ఆర్డీఎస్ నీళ్లు వచ్చిన దాఖలాలే లేవని, మరి ఇంతవరకు మల్లమ్మ కుంట, వల్లూరు, జూలకల్ మూడు రిజర్వాయర్ల సంగతి ఏమైందని అని ప్రశ్నించారు. అలాగే టీజీ వెంకటేష్ రాయలసీమ ఆల్కహాలిస్ ఫ్యాక్టరీ ఉండడం వల్ల అక్కడ నుంచి వచ్చిన కాలుష్యపు నీళ్ల వల్ల పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, అక్కడ నీళ్లు కూడా వినియోగించుకోనే పరిస్థితి లేదని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశవరావు, ప్రభుదాసు, సుంకన్న నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News