ఏం సాధించారని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు: మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
ఏం సాధించారని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ బీఆర్ఎస్ పాలకులను ప్రశ్నించారు.
దిశ, వడ్డేపల్లి: ఏం సాధించారని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ బీఆర్ఎస్ పాలకులను ప్రశ్నించారు. అలంపూర్ నియోజకవర్గం లోని వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధి శాంతినగర్ లో మీడియా సమావేశంలో సంపత్ కుమార్ మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల గురించి వారు మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే ఒకవైపు ఆశ్చర్యంగాను ఒక వైపు హాస్యాస్పదంగాను ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యేలు అంతా కూడా రివ్యూ ఏర్పాటు చేసుకుని పత్రికల్లో దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి అని అంటున్నారని, ఈ దశాబ్ది కాలంలో అసలేం ఏ విజయాలు సాధించారని విజయవంతం చేయాలని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పాలకులు గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఇటిక్యాల మండల అధ్యక్షుడు రుక్మంత రెడ్డి మహిళా అధ్యక్షురాలు నాగశిరమని మాజీ ఎంపిటిసి చిన్నిబాబు. జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి దేవేంద్ర తదితరులు ఉన్నారు