Vande Bharat Express : ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం దేశవ్యాప్తంగా వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఎక్స్ప్రెస్ రైళ్లలో భాగంగా కాచిగూడ-యశ్వంతపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం దేశవ్యాప్తంగా వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఎక్స్ప్రెస్ రైళ్లలో భాగంగా కాచిగూడ-యశ్వంతపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. కాచిగూడ నుంచి యశ్వంతపూర్ బయలుదేరే ఎక్స్ప్రెస్ రైలు మధ్యాహ్నం రెండు గంటలకు మహబూ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది అని ముందుగానే సంబంధిత అధికారులు ప్రకటించడంతో డీకే అరుణ, జితేందర్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి తరలి వచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా కే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.దేశంలోని వివిధ ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణించడానికి వందే భారత్ రైళ్లు తోడ్పడతాయని డీకే అరుణ జితేందర్ రెడ్డి అన్నారు. అనంతరం ఎక్స్ప్రెస్ రైలు రాగానే రైల్వే స్టేషన్ లో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు. జితేందర్ రెడ్డి, డీకే అరుణ రైలు ముందుకు సాగేందుకు పచ్చజెండా ఊపారు.
దేవరకద్రలో బీజేపీ రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ సారథ్యంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలోనూ డీకే అరుణ, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకొని డీకే అరుణ సారథ్యంలో పార్టీ శ్రేణులు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.