సంపద పెంచాలి..పేదలకు పంచాలి - ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. సంపద పెంచాలి,పేదలకు పంచాలి అనే నినాదం తో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలకాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోరారు.
దిశ, కొత్తపల్లి: కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. సంపద పెంచాలి,పేదలకు పంచాలి అనే నినాదం తో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలకాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని పెద్దాపురం గ్రామంలో కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ నేతృత్వంలో ఏ వర్గానికి విస్మరించకుండా సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ఈసారి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ మేనిఫెస్టో లో ఉన్న వివరాలు వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కార్డు కలిగిన ప్రతి ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎల్.ఐ. సి.ద్వారా రూపాయలు 5 లక్షల జీవిత బీమా కల్పిస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన 100% ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అలాగే అర్హులైన పేదలకు 400/ రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించడం జరుగుతుందని తెలిపారు.అలాగే ఎమ్మెల్యే ప్రచారం లో పాల్గొన్న ప్రతి గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు వందల సంఖ్యలో ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా వేసుకొని పార్టీలో చేరారు.పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.