పైరవీలు లేకుండా పోలీస్ సేవలు వినియోగించుకోండి

ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు.

Update: 2024-12-30 15:15 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. సోమవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత ఎస్ఐ,సీఐ,డిఎస్పీ లతో ఫోన్ లో మాట్లాడారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు నిర్భయంగా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇవ్వవచ్చని,చట్ట ప్రకారంగా వాటి పరిష్కారానికి స్వచ్చందంగా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మొత్తం 11 మంది బాధితులు తమ ఫిర్యాదులను సమర్పించారని,శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా శాఖ పనిచేస్తుందని ఆమె అన్నారు.


Similar News